కారు డ్యాష్ ఇవ్వడంతో గాల్లో పల్టీలు కొట్టిన బైకర్

  • ఢిల్లీకి సమీపంలో ప్రమాదం
  • తీవ్రంగా గాయపడిన బైకర్ 
  • పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు
రోడ్డును అడ్డంగా దాటుతున్నాడు ఓ బైకర్. అదే సమయంలో ప్రధాన రహదారిపై వెళుతున్న కారు వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టడమే కాకుండా కొంత దూరం పాటు బైక్ ను తోసుకెళ్లింది. కారు బలంగా ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి గాల్లోకి ఎగిరిపోయి పల్టీలు కొడుతూ కిందకు పడిపోయాడు. ఈ ప్రమాదం ఢిల్లీకి సమీపంలో గురువారం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సీటీసీటీ ఫుటేజీల రూపంలో బయటకు వచ్చింది. 

వాస్తవానికి బైకర్ రోడ్డు క్రాస్ చేయాలనుకున్న సమయంలో.. రహదారి ఖాళీగానే ఉంది. కానీ, అతడు రహదారిపై అటూ, ఇటూ చూసుకోకుండా ఎదురుగా చూసుకుంటూ పరధ్యానంలో వెళ్లడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్ గానే ఉందని వైద్యులు తెలిపారు. 



Car
Bike
Hits
Delhi

More Telugu News